ఘనంగా స్వాగత సమావేశం
ప్రశ్న ఆయుధం, కామారెడ్డి :
ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డి తెలుగు విభాగం పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఘనంగా స్వాగత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్’ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో అన్ని విషయాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కిష్టయ్య మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరై చదువులో గొప్పగా రాణించాలని, పట్టుదలతో నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కిష్టయ్య, తెలుగు శాఖధిపతి డాక్టర్ విశ్వప్రసాద్, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ రాజ్ గంభీరావు, డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, లక్ష్మణాచారి, రవి, మల్లేష్, బాలాజీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు