ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిది అక్టోబర్ 17రాయల పోలయ్య
ఈ కార్యక్రమంలో జడ్జ్ దంపతులను సన్మానించి మెమొంటోను దమ్మపేట న్యాయవాదులు మరియు బార్ అసోసియేషన్ వారు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్జ్ మాట్లాడుతూ దమ్మపేట కోర్టు నందు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసే సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పై కొత్తగూడెం సీనియర్ కోర్టుకు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ,నా పదవీకాలంలో నాకు సహకరించిన న్యాయవాదులకు కోర్టు సిబ్బందికి పోలీసువారికి మరియు దమ్మపేట కోర్ట్ కక్షిదారులు కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు మారం సతీష్ కుమార్ , జనరల్ సెక్రెటరీ గొంది మురళీమోహన్, సీనియర్ న్యాయవాదులు ఉడతనేని శ్రీను , శ్యామ్ సుధాకర్,లక్కినేని నరేంద్ర, సంజయ్, ఉదయ్, భవాని కృష్ణ యాదవ్, కాలం సంధ్యారాణి , అరుణ కుమారి, ఇతర మహిళ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.