పేదల కంటి వెలుగుకై సేవలందించిన లింభాద్రికి ఘన సన్మానం
39 ఏళ్ల ప్రజాసేవతో ఆదర్శంగా నిలిచిన ఆప్తాల్మిక్ అధికారి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం అక్టోబర్ 16:
జిల్లా ఆప్తాల్మిక్ అధికారి గా 39 సంవత్సరాలు సేవలందించి పదవీ విరమణ పొందిన సనేబోయిన లింభాద్రిని కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంయుక్తంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఐవిఎఫ్ రాష్ట్ర చైర్మన్ డా. బాలు, రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ హైమద్ మాట్లాడుతూ పేదలకు తక్కువ ఖర్చుతో కంటి చికిత్సలు అందించి లింభాద్రి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. కార్యక్రమంలో పర్ష వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.