సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో నూతనంగా ఎన్నికైన రైతు సంఘం అధ్యక్షుడు అమ్మగారి సదానంద రెడ్డి, దేవాలయ కమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్ రెడ్డిలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నాయకత్వంలో రైతు సంఘం దేవాలయ కమిటీ మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, మాజీ సర్పంచులు శంకర్, హనుమంత్ రెడ్డి, మొగులయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు ఆంజనేయులు, యాదవ్ మోహన్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి, ఆకుల సత్యనారాయణ, మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, సూర్యనారాయణ, విజేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సత్తయ్య, ప్రవీణ్ రెడ్డి, రాజు, శ్రీనివాస్, రాములు, నాయకులు పాల్గొన్నారు.
రైతు, దేవాలయ కమిటీ అధ్యక్షులకు ఘన సన్మానం
Published On: January 27, 2025 7:33 pm
