సంగారెడ్డి, ఆగస్టు 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): పదవీ విరమణ పొందిన సిబ్బందికి తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. సంగారెడ్డిలోని నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం సంఘ భవనంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్‌కు చెందిన దుర్గయ్య, చీఫ్ ప్లానింగ్ కార్యాలయం నుండి కే. సత్యనారాయణ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో పని చేసిన ఆనంద్‌లను పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ సేవా కాలంలో కష్టపడి పని చేశారని, భవిష్యత్తులో కూడా సమాజానికి తమవంతు సేవలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు షరీఫ్, సెక్రటరీ నాగరాజు, అసోసియేషన్ ప్రెసిడెంట్ పి. అశోక్, టౌన్ అధ్యక్షుడు పండరి, ట్రెజరర్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.
పదవీ విరమణ పొందిన నాలుగో తరగతి సిబ్బందికి ఘన సన్మానం
Oplus_131072