Site icon PRASHNA AYUDHAM

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో అహింసాహిత మహాకరణ శాఖాహార ర్యాలీకి ఘనమైన ప్రారంభం

IMG 20250127 WA00111

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో అహింసాహిత మహాకరణ శాఖాహార ర్యాలీకి ఘనమైన ప్రారంభం

నిజామాబాద్ నుండి 200 మంది ధ్యానులు తరలివెళ్లిన ర్యాలీ,

మూగజీవాల సంరక్షణకు ప్రాధాన్యం

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూమెంట్ ఆఫ్ ఇండియా (పి ఎస్ ఎస్ ఎం) ఆధ్వర్యంలో ఈ రోజు సిద్ధిపేట జిల్లా కేంద్రంలో అహింసాహిత మహాకరణ శాఖాహార ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పి ఎస్ ఎస్ ఎం నవనాథపురం కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ నుండి 200 మంది ధ్యానులు బస్సులు, కార్లలో తరలివెళ్లారు.

ముగజీవాల సంరక్షణకు జరిగిన ఈ ర్యాలీని నిజామాబాద్ జిల్లా పి ఎస్ ఎస్ ఎం అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి నేతృత్వం వహించారు. ర్యాలీల ద్వారా మూగజీవాల రక్షణ గురించి అవగాహన పెంపొందించడం లక్ష్యమని సాయి కృష్ణారెడ్డి తెలిపారు.

ఈ ర్యాలీలో పాల్గొన్నవారిలో పిఎస్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, అమరవాజి శ్రీనివాస్, వెల్మల్ భూమన్న, భోజన్న, సంతోష్, దేవేందర్ రెడ్డి, సురేష్, రెడ్డి మల్లయ్య, రాజు తదితరులు ఉన్నారు.

Exit mobile version