*భారతీయ మజ్దూర్ సంగ్ అధ్యక్షునికి ఘన సన్మానం*
ప్రశ్న ఆయుధం న్యూస్ జుక్కల్ ప్రతినిధి జనవరి-6
పిట్లం: జుక్కల్ నియోజకవర్గంలోని
నిజాంసాగర్ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో ఇటీవల మజ్దూర్ యూనియన్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 186 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో భారత్ మజ్దూర్ సంఘ్ నుండి పోటీ చేసిన కే. మహిపాల్ 46 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల్లో గెలుపొందిన మహిపాల్ ను.
బీసీ రాజ్యాధికార సమితి జిల్లా ఇంచార్జ్, అధ్యక్షుడు కుమ్మరి యాదగిరి శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో యూత్ సభ్యులు మహిపాల్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో బిసి రాజ్యాధికార సమితి కమిటీ సభ్యులు, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు, మజ్దూర్ యూనియన్ సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.