బాల్య మిత్రుల చేయూత నిజమైన స్నేహానికి నిర్వచనం
గజ్వేల్ డిసెంబర్ 19 ప్రశ్న ఆయుధం :
అధైర్య పడొద్దు…అండగా ఉంటాము అంటూ చిన్ననాటి స్నేహితుల సహాయం నిజమైన స్నేహానికి నిర్వచనం ఇదే తమతోపాటు ప్రజ్ఞాపూర్ పాఠశాలలో చదువుకున్న చిన్ననాటి మిత్రురాలు బాలలక్ష్మి భర్త అప్పుల బాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తెలుసుకున్న స్నేహితులు చలించిపోయి స్నేహితురాలకు సహాయం అందించాలని తలిచారు. 50 వేల రూపాయలు నగదు నిత్యవసర సరుకులు ఆ కుటుంబానికి అందించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చిన్ననాటి మిత్రులు మాట్లాడుతూ చిన్న వయసులోనే ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదని బతుకుండీ ఉండి పోరాటం చేయాలన్నారు. బాల్ లక్ష్మి కి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె లకు ధైర్యం చెప్పారు. ఇలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీలత రాజేశ్వరి జ్యోతి, భార్గవి భవాని సత్యలక్ష్మి, తాడేం కనకయ్య, పొట్ట స్వామి రాజు, సత్యనారాయణ యునిస్ తదితరులు పాల్గొన్నారు.