మహనీయుల విగ్రహాలకై అనుమతి కోసం వినతి పత్రం ఇచ్చిన అంబేద్కర్ సంఘం నాయకులు
ప్రశ్న ఆయుధం కామారెడ్డి, బిబిపేట్
బీబీపేట మండలంలోని జనగామ మర్రి వద్ద కూడలిలో చత్రపతి శివాజీ, మహారాజ్ డాక్టర్ భీమ్రావు అంబేద్కర్, మహాత్మ పూలే యొక్క విగ్రహాలకు అనుమతి ఇప్పించగలరని జనగామ అంబేద్కర్ సంఘం సభ్యులు బిబిపేట మండల కమిటీ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ లకు వినతి పత్రం అందించారు. ఈ యొక్క కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు భూమా గౌడ్, పరకాల రవి, అంబేద్కర్ సంఘం నాయకులు ఆకుల బాబు, బెల్లె రాజబాబు, పాత స్వామి, జనగామ గణేష్, ఆకుల దయాకర్, పాత అశోక్, దినేష్, నర్ముల్ రామచంద్రం, నాని, పాత గోపి, రాజు తదితరులు పాల్గొన్నారు.