●బయోందోళనతో అయోమయానికి గురైన పాఠశాల విద్యార్థులు..
●ఎంఈఓ బుచ్చనాయక్ సమయస్ఫూర్తితో సమస్యకు పరిష్కారం..
ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 9 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చెంది గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో ఒక కోతి చనిపోవడంతో సంఘటిత బలానికి మారుపేరైన వానర సైన్యం ఒక్కసారిగా పాఠశాల ప్రాంతాన్నంత చుట్టిముట్టాయి. వాటిని వెళ్లగొట్టడానికి గ్రామస్తులు ఎంత ప్రయత్నించిన అవి మీదిమీదికి రావడంతో బయపడిపోయారు. విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి బుచ్చనాయక్ హుటాహుటిన చెంది ఉన్నత పాఠశాలకు వెళ్లి పరిశీలించగా కోతి చనిపోయి చుట్టూ కోతుల దండుతో విద్యార్థులు పాఠశాలలోకి వెళ్లలేక భయపడుతున్న విషయం తెలుసుకొని సమస్య పరిష్కారానికి ఆలోచించి చక్కటి పరిష్కారానికి తెరలేపారు. పాఠశాల ఆవరణలో ఉన్న కోతి శవాన్ని బయటకు తెస్తేనే కోతులు ఇక్కడి నుండి వెళ్ళిపోతాయని ఆలోచించిన ఎంఈఓ తన కారును హారన్ మోగిస్తూ పాఠశాల ఆవరణలోకి తీసుకెళ్లి కోతి శవాన్ని ఒకరిద్దరి సహాయంతో ఒక గోనెసంచిలో కట్టి కారులోనే వేసుకొని బయటకు రావడంతో కోతులన్నీ కూడ అక్కడి నుండి కారును వెంబడించడంతో పాఠశాల ప్రాంగణమంతా కోతుల విముక్తి కలిగినది. ఎంఈఓ బుచ్చనాయక్ సమయస్ఫూర్తితో అక్కడ సమస్య పరిష్కారమయింది. కోతుల భయానికి సోమవారం పాఠశాలకు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.