బీసీ కులాల రిజర్వేషన్ 42 శాతం అమలు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 18 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులాలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని కొత్తగూడెంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో పార్టీలు,కుల సంఘాలు శనివారం భారీ ర్యాలీ నిర్వహించాయి. బిజెపి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తీర్మానం చేసి చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాట్లాడారు.పెద్ద ఎత్తున లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యార్డు నుండి భారీ ప్రదర్శన మెయిన్ రోడ్డు వెంట పోస్ట్ ఆఫీస్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకంచేసి పూలమాలలతో నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అర్జున్ రావు, మహిళా నాయకురాలు దేవి ప్రసన్న,సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కె షాబీర్ పాషా, జమలయ్య,రత్నకుమారి, బిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర నాయకులు,వనమా రాఘవ, బత్తుల వీరయ్య,బిజెపి పార్టీ జిల్లా నాయకులు రంగా కిరణ్, శ్రీధర్,తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు మల్లెల రామనాథం,షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు సోమయ్య,దీపంగి రమణయ్య,చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూసపాటి శ్రీనివాస్,దసలపూడి భాస్కర్ తెలంగాణ మాదిగ జేఏసీ మోదుగ జోగారావు,డీఎస్పీ పార్టీ జిల్లా నాయకులు సంజీవని మహారాజు, మాల మహానాడు జిల్లా నాయకులునవతన్,
అశోకు, తదితరులు పాల్గొన్నారు.