భార్య వివాహేతర సంబంధం.. ఆత్మహత్య చేసుకున్న భర్త
నువ్వు నాకు వద్దు.. చచ్చిపో అన్న భార్య.. అవమానంగా భావించి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న భర్త
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో హరీశ్ (36)కు కరీంనగర్ జిల్లా బద్దిపెల్లి గ్రామానికి చెందిన కావేరితో 2014లో వివాహం జరగగా.. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు
హరీశ్ ఉపాధి కోసం దుబాయి వెళ్లగా.. అతడి భార్య వివాహేతర సంబంధం పెట్టుకోగా, ఈ విషయంలో ఫోన్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది
దీంతో ఈ నెల 8న హరీశ్ దుబాయి నుంచి తడగొండకు వచ్చిన క్రమంలో ‘నువ్వు నాకు వద్దు.. చచ్చిపో.. నేను రక్షణ్ తోనే ఉంటా’ అని భర్తతో తేల్చిచెప్పిన కావేరి
దీంతో మనస్తాపం చెంది బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఓ వ్యవసాయ బావిలో ఆత్మహత్య చేసుకున్న హరీశ్
హరీశ్ తల్లి ఫిర్యాదు మేరకు కావేరి, రక్షణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు