ఈనెల 25 న హైదరాబాద్ లో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశం
ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 17 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సిహెచ్ అవిలయ్య రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈనెల 25 న హైదరాబాద్ నగరంలో గాజులరామారం రోడ్డ మేస్త్రి నగర్ అబ్బాస్ టవర్ జీడిమెట్ల సమయం ఉదయం 10 గంటలకు శనివారం షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తప్పక హాజరు కాగలరని కోరారు.తెలంగాణ రాష్ట్రంలో సగం భూభాగం ఏజెన్సీ ప్రాంతం పేరుతో ఎస్సీ కులాల తొలగించిన స్థానిక రిజర్వేషన్ తిరిగి అమలు చేయాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ కులాల జనాభా పెరిగినందున ఎస్సీ రిజర్వేషన్ 20% పెంచివిద్యా ఉద్యోగ ఉపాధి
రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ భవిష్యత్ కార్యాచరణపై సమావేశం ఉంటుందని అన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ జాతీయ కమిటీ చైర్మన్ డాక్టర్ జె బి రాజు, వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ పాల్గొంటారని తెలియజేశారు.ముఖ్య నాయకులు కార్యకర్తలు యువతి, యువకులు,విద్యావంతుల మేధావులు అధిక సంఖ్యలో పాల్గొనలని అవిలయ్య వెల్లడించారు.