బస్సు వెనుక భాగం తగిలి వ్యక్తి మృతి

*ఆర్టీసీ బస్సు డాష్ కొట్టి యువకుని మృతి*

*జమ్మికుంట/ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 7*

బస్సు డాష్ కొట్టి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి లో చోటు చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే కరీంగనర్ జిల్లా ఇల్లందకుంట మండలోని శ్రీరాములపల్లి కి చెందిన బొద్దుల శ్రీనివాస్ 38సంవత్సరాలు ద్విచక్ర వాహనంపై హన్మకొండ కి వెళ్తుండగా కనగర్తి గ్రామ శివారు గుండెడు మధ్యలో వెనక నుండి ఆర్టీసీ బస్సు వచ్చి ఓవర్ టెక్ చేసే టైంలో ఒకేసారి ఆరనివ్వడంతో ఉలిక్కిపడి బస్సు వెనుక భాగం డాష్ ఇవ్వడంతో బైకు అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు బొద్దుల శ్రీనివాస్ అకాల మరణంతో శ్రీరాములపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్ కి వివాహమై భార్య అనూష తో పాటు 6సంవత్సరాల అమ్మాయి కలదు శ్రీనివాస్ కు జాబ్ రాకపోవడంతో కుటుంబం పోషణకై ఉపాధి కోసం జమ్మికుంట లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సమీపంలో జిరాక్స్ నడుపుతూ కుటుంబ పోషణ సాగిస్తున్నాడు కొన్ని రోజులు ప్రవేట్ పాఠశాలలో ఉపాద్యాయుడుగా కూడా పనిచేసి చేశాడు కుటుంబ పెద్ద అకాల మరణం చెందడం కూతురు కూడా చిన్న వయస్సు లో ఉండడం కుటుంబ పోషణ ఇబ్బంది కారణంగా ఉంటుందని ప్రభుత్వం శ్రీనివాస్ కుటుంబాన్ని ఆర్ధిక ఆదుకోవాలని ఆర్టీసి సంస్థ నుండి నష్టపరిహారం ఇప్పించాలని స్థానికులు బంధువులు కోరుతున్నారు ఈ పరిధి హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుందని కమలాపూర్ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు

Join WhatsApp

Join Now