రోడ్డు ప్రమాదంలో గండివేట్ గ్రామానికి చెందిన వ్యక్తి మృతి

*రోడ్డు ప్రమాదంలో గండివేట్ గ్రామానికి చెందిన వ్యక్తి మృతి*

IMG 20250208 WA0052

ఆయుధం న్యూస్ 08 ఫిబ్రవరి కామారెడ్డి జిల్లా గాంధారి

అర్థ రాత్రి 12 గంటల సమయంలో బాన్సువాడకు చెందిన షేక్ అహ్మద్, 32 సంవత్సరాలు తన సొంత గ్రామమైన గండివేట్ గ్రామానికి వచ్చి తిరిగి వెళుతుండగా గాంధారి మండలం మొండి సడక్

గ్రామ శివారులో షాదుల్లా ఉసేని దర్గా వద్ద వెనుక నుంచి వస్తున్న TATA ZEST వెహికల్ TS 28 G 4383 బైకు ని ఢీకొట్టడంతో షేక్ అహ్మద్ తలకు తీవ్రమైన గాయమై, అక్కడికక్కడే మృతి చెందినాడు. భార్య సమ్రీనా బేగం ఫిర్యాదు మేరకు ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేయడం జరిగింది. మృతునికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.

Join WhatsApp

Join Now