గంజాయి తరలిస్తున్న ఒకరి అరెస్ట్
నిజామాబాద్ జిల్లా
ఆర్మూర్ మండల మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి తరలిస్తున్న మహమ్మద్ వహీద్‌ను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ స్టీవెన్సన్ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి కేజీ ఎండు గంజాయి, వాహనం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. వాహనాల తనిఖీల్లో ఎక్సైజ్ సిబ్బంది చంద్రమౌళి, సందీప్, శ్రీనివాస్, సాగర్, నరేశ్, దేవిదాస్, సాయిబాబా, మోహన్, ధర్మేందర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.