Site icon PRASHNA AYUDHAM

మద్యం తాగి డ్రైవ్ చేసిన వ్యక్తికి జైలు శిక్ష

IMG 20250813 WA0406

మద్యం తాగి డ్రైవ్ చేసిన వ్యక్తికి జైలు శిక్ష

 

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 13

 

మద్యం మత్తులో వాహనం నడిపి పట్టుబడిన ఓ వ్యక్తికి కోర్టు జైలు శిక్ష విధించింది. కామారెడ్డి జిల్లా సెకండ్ క్లాస్ న్యాయమూర్తి టి. చంద్రశేఖర్ బుధవారం ఇచ్చిన తీర్పులో, ఎర్రపాడు గ్రామానికి చెందిన బొంబోతుల రాజా గౌడ్ (40) మంగళవారం రాత్రి మద్యం సేవించి ద్విచక్రవాహనం నడుపుతున్న సమయంలో తాడువాయి పోలీసులు తనిఖీల్లో పట్టుకున్నారు. ఆల్కహాల్ మీటర్‌ రీడింగ్ 550 రావడంతో కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి రాజా గౌడ్‌కు రెండు రోజుల సాదాసీదా జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా విధించారు. ఈ కేసు దర్యాప్తు ఎస్‌ఐ టి. మురళి, సిబ్బంది చేశారు.

Exit mobile version