విద్యుత్ తీగలు తగిలి పెయింటింగ్ చేస్తున్న వ్యక్తి మృతి.
(ప్రశ్న ఆయుధం ఆగస్టు 31)
నిజామాబాద్ నగరంలో విద్యుత్ తీగలు
ప్రమాదకరంగా మారాయి. ఇళ్ల మీద నుంచి కరెంట్ తీగలు వెళ్తుండటంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సీతారాం నగర్ కాలనీలో ఓ పెయింటర్ విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.కాలనీలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. పనులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర కు చెందిన నాందేవ్ (45) ఆ ఇంటికి పెయింటింగ్ వేయడానికి వచ్చాడు. అయితే ఇంటిపైన విద్యుత్ తీగలు ఉన్నాయి. నాందేవ్ ప్రమాదవశాత్తు వాటికి తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై గంగాధర్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.