తాగిన మత్తులో దొంగతనానికి వచ్చి ఫ్లైఓవర్ పైనుంచి దూకిన వ్యక్తి
– ఫలక్‌నుమాకు చెందిన రాములు (55) అనే వ్యక్తి మధ్యాహ్నం దాదాపు రెండు గంటల సమయంలో మద్యం సేవించి అంబర్‌పేట
శ్రీ రమణ చౌరస్తా సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద ఉన్న ఇనుప రాడ్లు దొంగతనం చేయడానికి వచ్చాడు
అయితే రాడ్లు దొంగతనం చేస్తుండగా నిర్మాణ కూలీలు అది గమనించి కేకులు వేయడంతో కంగారుపడిన రాములు
ఫ్లైఓవర్ పైనుంచి కిందికి దూకాడు
ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో.. అతన్ని చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.