కార్మికుడి నుండి కార్మిక నాయకుడిగా ఎదిగిన వ్యక్తి
పి జె ఆర్ _ బండి రమేష్
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 28: కూకట్‌పల్లి ప్రతినిధి
కార్మికుడి నుండి కార్మిక నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మంత్రిగా సిఎల్పి నాయకుడిగా ఎదిగిన పి జనార్దన్ రెడ్డి ని యువత ఆదర్శంగా తీసుకోవాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. పిజెఆర్ 17వ వర్ధంతి సందర్భంగా బాలనగర్ ,మూసాపేట ,ఐడియల్ కంపెనీ దగ్గర మరియు ఖైరతాబాద్ అభిమానులు ఏర్పాటుచేసిన చిత్రపటాలకు విగ్రహాలకు రమేష్ స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ రాష్ట్రమంత్రి స్థాయి వరకు ఎదిగిన పీజేఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు నేటి తరం నాయకులకు అనుసరణీయమన్నారు. కి. శే. పి. జనార్దన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ లో కీలక వ్యక్తి గా .ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎం.ల్.ఏ గా ఎన్నికై అనేక పాత్రలు శాసనసభ సభ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, సీఎల్ఫీ నాయకులు గా, ట్రేడ్ యూనియన్ లీడర్ గా , ఎన్నో పదవులు ప్రాతినిధ్యం వహించి ప్రజలకు సేవ చేయడంలో ముందు ఉండేవారని ఆయన ప్రజలకు చేసిన సేవలు మరువలేనిది అని, డిసెంబర్ 28, 2007 న పీ జే ర్ మరణించడం కాంగ్రెస్ పార్టీ కి మరియు తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని బండి రమేష్ గుర్తుచేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్ ,బ్లాక్ అద్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, మైనారిటీ నాయకులు, ఎస్ సి సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు మరియు కార్యకర్తలు , పాల్గొన్నారు,