ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన వ్యక్తి మృతి

*ఆత్మహత్యాయత్నానికి యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి*

*జమ్మికుంట ఏప్రిల్ 18 ప్రశ్న ఆయుధం*

జమ్మికుంట మండలంలోని శాయంపేట గ్రామానికి చెందిన మడికొండ శ్రీనివాస్ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య మడికొండ లత పోలీస్ స్టేషన్ కు వచ్చి తన భర్త మడికొండ శ్రీనివాస్ (49) 8 సంవత్సరముల క్రితం తన సొంత ట్రాక్టర్ నడుపుతూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి ఎదుటి వ్యక్తి చనిపోయినాడని దానికి ఖర్చులకి తన భర్త ట్రాక్టర్ అమ్మినాడని భూమి కూడా అమ్మినాడని ఇదే విషయం మనసులో పెట్టుకొని అప్పటినుండి మానసికంగా కృంగిపోయి మద్యానికి బానిసైనాడని ఇలా రోజు మద్యం తాగడం వల్ల తన శరీరంలోని అవయవాలు క్షీణించినాయని డాక్టర్ చెప్పగా ఆ విషయం మనసులో పెట్టుకొని ఈనెల 15న రోజున మధ్యాహ్నం మూడున్నర గంటలకు తన భార్య పనికి వెళ్లి వచ్చేసరికి ఇంటి లోపల గడ్డి మందు తాగి కనిపించగా వెంటనే జమ్మికుంట లోని విజయసాయి హాస్పిటల్ కు తీసుకు వెళ్ళగా అక్కడ రెండు రోజులు చికిత్స పొంది మెరుగైన వైద్యం కోసం 17వ తేదీన రోజున ఎంజీఎం కు తీసుకెళ్లగా రాత్రి సుమారు 9:30 గంటలకు చనిపోయినాడని దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసినట్లు జమ్మికుంట సీఐ రవి తెలిపారు.

Join WhatsApp

Join Now