మినిమం టైం స్కేల్ అమలు చేయించాలి
పాఠశాల విద్యా డైరెక్టర్ కు జగదేవపూర్ సీఆర్పిఎం ఐ ఎస్ లు వినతిపత్రం అందజేత
సిద్దిపేట ఆగస్టు 4 ( ప్రశ్న ఆయుధం ) :
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం లో సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయడంతో పాటు రెగ్యులర్ చేయాలని కోరుతూ జగదేవపూర్ సమగ్ర శిక్ష ఉద్యోగులు పాఠశాల విద్యా డైరెక్టర్ వెంకట్ నర్సింహా రెడ్డికి వినతి పత్రం అందించారు. ఆదివారం జగదేవపూర్ కేజీబీవీ పాఠశాల సందర్శించిన ఆయనను కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ ఎ జే ఏ సి జగదేవ్ పూర్ అధ్యక్షులు దయానంద్ , కేజీబీవీ ఎస్ ఓ ఉమామహేశ్వరి ఎం ఐ ఎస్ గోవర్ధన్, కే జి బి వి పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు