దమ్మపేట మండలం లో కదం తొక్కిన ఆదివాసి

 

 

 

దమ్మపేట మండలం కేంద్రం లో ఆదివాసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలం( కబ్జా) ఆక్రమణ పై ఆగ్రహించిన ఆదివాసీలు …

 

 తహసిల్దార్  కార్యాలయం వద్ద ధర్నా చేసి ఆదివాసీ కమ్యూనిటీ హాల్ స్థలం ఆక్రమణ కి భాధ్యులయిన వారి పై వెంటనే కేసు నమోదు చేసి శిక్షించాలి అని దమ్మపేట తహసిల్దార్ మరియు ఎస్ఐలకు  వినతి పత్రలు అందజేసిన ఆదివాసీ నాయకులు 

 

పలు ఆదివాసీ గ్రామాలు నుండి భారీ సంఖ్య లో స్వచ్ఛందం గా తరలి వచ్చి దమ్మపేట మండలం కదo తొక్కిన ఆదివాసీ నాయకులు,మహిళలు 

 

మన్యం.బొబ్బిలి తెలంగాణ సాయుధ పోరాట సమరయోధులు సోయం గంగులు,గోండు బొబ్బిలి కొమరం భీమ్ విగ్రహాలకు శుద్ది చేసి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆదివాసీ నాయకులు 

 

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం లో ఆదివాసీ జె.ఎ. సి అద్వరియo దమ్మపేట మండలం తాసిల్దార్  కార్యాలయం పక్కాన ఉన్నా ఆదివాసీ కమ్యూనిటీ హాల్ స్థలం ని కొందారు స్వచ్ఛంద సంస్థ పేరు తో అనుమతులు లేకుండ ఆదివాసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలం ని రెండు రోజులు ఆక్రమణ పై బగ్గుమన్న ఆదివాసీ యావత్ సమాజం,,,, ఆదివాసీ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మన్యం వీరుడు సోయం గంగులు,గోండు.బొబ్బిలి కొమరం భీమ్ విగ్రహాల ముంధు చనిపోయిన శవాలు కి ధహనా సంస్కారాలు ,శవ పెటికను పెట్టి కబ్జా చెయ్యడం పై భగ్గుమన్న ఆదివాసీలు .మహనీయులు విగ్రహాలు ముంధు తుచ్చపు చర్యలు వల్ల ఆదివాసీలు ఆత్మగౌరవం దెబ్బతిన్నది అని అటువంటి చర్యలకి పాల్పడిన వ్యక్తులు ఆదివాసీ సమాజం కి భహిరంగంగా క్షమపణ చెప్పలని, స్థలం ఆక్రమించుకున్నా వారి పై చట్టపరమైన చర్యలు తీసుకొని, కేసులు నమోదు చెయ్యాలి అని దమ్మపేట ఆదివాసీ నాయకులు 

 తహసిల్దార్  కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించి ,వినతిపత్రం అందించారు…తదుపరి దమ్మపేట మండలం పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై సాయి కిషోర్ రెడ్డి  ఆదివాసీ నాయకులు వినతిపత్రం అందించి భాధ్యుల పై కేసులు నమోదు చేసి శిక్షించలన్నారు.ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ నాయకులు మట్లాడుతూ ఆదివాసీ పోరాట యోధులు కొమరం భీమ్,సోయం.గంగులు విగ్రహాలు సాక్షిగా ఆదివాసీలకు కేటాయించబడ్డ ఆదివాసీ కమ్యూనిటీ హాల్ పై డేగ కన్నుపడింది అని గత కొన్ని రోజులు నుండి ఆ స్థలం పై కొందరు రాజకీయ పార్టీలు,స్వచ్ఛంద సంస్థ లో పని చేస్తున్నా వ్యక్తులు కబ్జా చెయ్యడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.రాజకీయ పార్టీలకు అతితం గా వివిధ పనులు నిమిత్తం వచ్చె వారికి ఉపయోగపడేలా సధుద్దేశం నిర్మాణం పనులు ప్రారంభించిన తరుణం లో ఏకంగా కబ్జా చెయ్యడం విస్మయానికి గురి చేసింది అన్నారు.ఏ వ్యక్తులు అయ్యిన రాజకీయ పార్టీల పక్షాల నాయకులు యిటువంటి చర్యలకు పాల్పడితే,ప్రతిఘటన తప్పదు అని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో ఆదివాసీ నాయకులు కోర్సా వెంకటేష్ ధోరా,బండారు సూర్యనారాయణ,కారం శ్రీరాములు, గడ్డం వెంకటేశ్వర్లు,కాసిని వెంకటేశ్వరరావు, కట్టం ఎర్రప్ప ధోర,వాసం వెంకటేశ్వరరావు,తంబల్లా రవి,కారం.బొజ్జి,సోయం రామ్మూర్తి, వుకే అప్పారావు,అప్పిరెడ్డి వెంకన్న,కారం వెంకట్రావు,చేపా నాగరాజు,యట్ల శివకుమార్,గుల్లా రాంబాబు,సోయం ఉమాహేశ్వరావు,ఆదివాసీ మహిళ నాయకురాలు దుర్గమ్మ,సారలమ్మ,నాగమణి,స్వాతి,పుష్ప,దుర్గ పెద్ద సంఖ్య లో నాయకులు,మహిళలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now