ఉదయం పెళ్లి చేసుకుని.. రాత్రి ఉరేసుకున్న నవ వధువు
శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోమందేపల్లికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షిత (22)కు నాగేంద్ర అనే వ్యక్తితో సోమవారం ఉదయం వివాహం జరిగింది. నూతన దంపతులకు సోమందేపల్లిలో మొదటిరాత్రి వేడుక నిర్వహించేందుకుగాను బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో తన గదిలోకి వెళ్లిన నవవధువు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు గది తలుపులు పగలగొట్టి చూడగా.. అప్పటికే ఆమె మృతి చెందింది.