Site icon PRASHNA AYUDHAM

అంధులకు చూపు… అద్భుతం సృష్టిస్తున్న కొత్త టెక్నాలజీ..!

IMG 20251021 WA0030

అంధులకు చూపు… అద్భుతం సృష్టిస్తున్న కొత్త టెక్నాలజీ!

శాశ్వత అంధులకు చూపు తెప్పిస్తున్న ‘ప్రిమా’ అనే వైర్‌లెస్ ఇంప్లాంట్

వృద్ధాప్య అంధత్వంతో బాధపడుతున్న వారిపై విజయవంతమైన ప్రయోగాలు

క్లినికల్ ట్రయల్స్‌లో 80 శాతానికి పైగా సానుకూల ఫలితాలు

పరికరం సాయంతో అక్షరాలు, పుస్తకాలు చదువుతున్న బాధితులు

వైద్య చరిత్రలో ఇదొక అద్భుతమైన విజయమన్న పరిశోధకులు

ప్రత్యేక కళ్లద్దాలు, కంటిలోని చిప్ ద్వారా పనిచేసే టెక్నాలజీ

శాశ్వత అంధత్వంతో బాధపడుతున్న లక్షలాది మందికి వైద్య శాస్త్రం సరికొత్త ఆశను చూపిస్తోంది. వయసు పెరగడం వల్ల వచ్చే తీవ్రమైన కంటి సమస్య (ఏజ్‌-రిలేటెడ్ మాక్యులార్ డీజెనరేషన్ – AMD) కారణంగా పూర్తిగా చూపు కోల్పోయిన వారికి సైతం మళ్లీ దృష్టిని ప్రసాదించే ఒక వైర్‌లెస్ రెటీనా ఇంప్లాంట్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ‘ప్రిమా’ (PRIMA) అనే ఈ పరికరం సాయంతో అంధులు సైతం ఇప్పుడు అక్షరాలను, పదాలను చదవగలుగుతున్నారు. సోమవారం వెలువడిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.

ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా వృద్ధులు ఏఎండీ కారణంగా శాశ్వత అంధత్వంతో బాధపడుతున్నారు.

Exit mobile version