నూతన కార్యవర్గం

టి జె ఎస్ ఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ ఆదేశాల మేరకు నిజామాబాదు జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా కార్యవర్గాన్ని హైదరాబాద్ టీజేఎస్ఎస్ కార్యాలయంలో ఎన్నుకున్నారు.
జిల్లా అధ్యక్షులుగా డీ.ఎల్.యన్.చారి. ప్రధాన కార్యదర్శిగా సితార్ల సురేష్,ఉపాధ్యక్షులు గా గవస్కర్, కోశాధికారిగా తమ్మల పాండు, సలహాదారునిగా సురేష్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా రామకృష్ణ, సంతోష్, రవి, గంగాధర్ లను నియమించినట్లు ప్రకటించారు.

జర్నలిస్టుల సమస్యలు అనంతం వాటి పరిష్కారం ఆవశ్యం

జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తా
అధ్యక్షులు డీ.ఎల్.యన్.చారి.

నియామక పత్రం అందజేసిన టి జె ఎస్ ఎస్ సంఘం ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ

ఈ సందర్భంగా డి.ఎల్.యన్.చారి. మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడమే జర్నలిస్టుల సంక్షేమ సంఘం యొక్క మార్గం, సమాజ శ్రేయస్సుతోపాటు జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, భరోసా, ప్రధాన ఏజెండగా ముందుకు వెళ్తామని తెలిపారు. జర్నలిస్టుల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. తన సేవలను గుర్తించి ఇంతటి పెద్ద బాధ్యతను తనపై ఉంచినందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు.అనంతరం సీనియర్ జర్నలిస్టులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now