Site icon PRASHNA AYUDHAM

దొంగతనం చేసిన వ్యక్తికి దేహశుద్ధి యజమాని చొరవతో రాత్రికి రాత్రే జంప్

IMG 20241107 WA0042

*వావిలాలలో దొంగతనం చేసిన వ్యక్తికి దేహశుద్ధి*
*యాజమాని చొరవతో రాత్రికి రాత్రే జంప్!*

*జమ్మికుంట నవంబర్ 7 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలోని ఓ ఇంట్లో బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నగదు దొంగతనం చేయడంతో ఇంటి యజమాని దొంగతనం జరిగిందని గ్రహించి ఇంటి ఆవరణలోకి వచ్చిన బీహార్ వ్యక్తిని నిలదీయగా దొంగతనం ఒప్పుకోవడం తో గ్రామస్తులు దేహశుద్ధి చేసి ఇటుకల తయారీ యజమానికి అప్పజెప్పడంతో రాత్రికి రాత్రి ఆ వ్యక్తిని సొంత రాష్ట్రానికి పంపించడంతో గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామంలోని ఓ పాఠశాల ఆవరణలో ఇటుకల తయారీ కంపెనీ ఏర్పాటు చేసి అందులో పని కోసం ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను పిలిపించి పని నిర్వహిస్తున్నాడు ఈ నేపథ్యంలోనే పని కోసం వచ్చిన బీహార్ వ్యక్తి దొంగతనం చేయడం తో వావిలాల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు దొంగని దేహశుద్ధి చేసి ఇటుకల తయారీ యజమానికి అప్పజెప్పడంతో రాత్రికి రాత్రే వ్యక్తిని సొంత రాష్ట్రానికి పంపించడం పై పలువురు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా పోలీసులు స్పందించి కార్మికులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకొని,మరోసారి ఇలాంటి ఘటనలు పునరవృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Exit mobile version