రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసం నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలి
తెలంగాణ రికార్డు ఆఫ్ రైట్స్ చట్టం 2024 ముసాయిదా చర్చలో
సీపీఎం పార్టీ పలు సూచనలు, సవరణలు
సిద్దిపేట ఆగస్టు 23 ప్రశ్న ఆయుధం :
రాష్ట్ర ప్రభుత్వం ధోరణిని భూమాత గా మారుస్తూ 20 సెక్షన్ లతో చట్టాన్ని రూపొందించి ముసాయిదా ను విడుదల చేసి పార్టీలు, ప్రజలు నుంచి అభిప్రాయం కోరిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం లో శుక్రవారం జరిగిన ముసాయిదా బిల్లు పైన చర్చ లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్ పాల్గొన్నారు, సిపిఎం నుంచి ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదా కు పలు సవరణలు సూచనలు చేశారు. పాసుపుస్తకాల చట్టం 1971లోని సెక్షన్ 26 ను ధరణి చట్టం లో రద్దు చేశారు దీని మూలంగా సాగు దారులు, అనుభవం దారులు కాలం లేకపోవడం తో దశాబ్దాల తరబడి సాగులో ఉన్న వారు
హక్కులు కోల్పోయారు. అందుకే తెలంగాణ రికార్డు ఆఫ్ రైట్స్ చట్టం 2024 1971 పాస్ పుస్తకాల చట్టం లో సెక్షన్ 26 పునరుద్ధరణ చేయాలి
ముసాయిదా చట్టంలోని సెక్షన్ రెండు లో 19 రకాల భూములకు పాస్ పుస్తకాలు ఇవ్వటానికి అంగీకరించిందని, ఇందులో పోడు భూములు చేర్చాలి ఆర్ ఓ ఆర్ జాబితా గ్రామాల వారీగా తయారు చేయాలి. క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది ని నియమించాలి.
హైకోర్టు తీర్పు ప్రకారం సాదా బైనామాలు 12 10 2020 కు ముందు వచ్చిన 2,76,693 దరఖాస్తులను ఆమోదించాలి ఇప్పటికే ఫారం 10 లో దరఖాస్తు చేసుకున్నారు అర్హులందరికీ సాదా బైనామాల కు ఉచిత రిజిస్ట్రీ చేసి పట్టా పాస్ పుస్తకం ఇవ్వాలి వన్ టైం సెటిల్మెంట్ గా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. 2011 భూ అధికృత రైతుల చట్టాన్ని పునరుద్ధరణ చేయాలి ఈ చట్టం వల్ల కౌలు రైతులకు రుణ గుర్తింపు కార్డులు,పంట రుణాలు,పంటల బీమా, ప్రకృతి వైపరీత్యాల పరిహారం, ప్రభుత్వ పధకాలు వర్తిస్తాయి.
తహశీల్దార్, ఆర్డీవో కు వ్యతిరేకంగా ఎవరైనా అప్పీల్ చేయదలచుకున్నచో మొదట కలెక్టర్ తదుపరి సిసిఎల్ఏ కి మాత్రమే చేయాలి అనే ముసాయిదా ప్రతిపాదన సరికాదని జిల్లా కలెక్టర్ అనేక విధులు నిర్వహించాల్సి ఉంటుంది సకాలంలో అప్పీల్ స్వీకరించి, పరిష్కారించడానికి అలస్యం అవుతుంది అందుకు ప్రతి జిల్లా కేంద్రంలో నోడల్ ఆఫీసర్ ను పెట్టి రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలి. అప్పీల్ చేసిన నెల రోజుల్లో సమస్య పరిష్కారించబడాలన్న నిబంధన ఉండాలి.
జిల్లాలో అనేక గ్రామాల్లో 70-80 సంవత్సరాల క్రితం నుంచి సాగు లో ఉన్న రైతులకు పాస్ పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత పోజిషన్ ఆధారంగా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలి.ధరణి పోర్టల్ పెండింగ్ దరఖాస్తులు పరిష్కారం చేయాలి స్లాట్ బుకింగ్ ద్వారా ప్రభుత్వం ఖజానా కు డబ్బులు చెల్లించి పాస్ పుస్తకాలు పోందలేక పోయిన వారికి డబ్బులు తిరిగి చెల్లించాలని కోరారు సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు చొప్పరి రవికుమార్,నాయకులు చల్లారపు తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.