Site icon PRASHNA AYUDHAM

శ్రీవారి లడ్డులో పొగాకు పొట్లం..

IMG 20240923 WA0076

తిరుపతి శ్రీవారి లడ్డులో పొగాకు పొట్లం (అంబర్) కనిపించడం ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంకు చెందిన దొంతు పద్మ అనే భక్తురాలికి ఆశ్చర్యం కలిగించింది. ఈ సంఘటన ఈ నెల 19న జరిగినదని పేర్కొంది. తిరుపతిలో శ్రీవారి దర్శనానికి వెళ్లిన పద్మ, లడ్డు ప్రసాదాన్ని బంధువులకు పంచే సమయంలో పొగాకు పొట్లం కనిపించడం గమనించింది. పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో ఇలాంటి ఘటన జరగడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ ఘటనపై భక్తులు ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని, ప్రసాదం నాణ్యతను పునరావలోకనం చేయాలని కోరుతున్నారు.

శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు కనిపించడంతో ఆశ్చర్యానికి గురైన భక్తురాలు పద్మ.పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో పొగ కనిపించడంతో ఆగ్రహం చేస్తున్న భక్తురాలు.శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రానికి గురి చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్న భక్తులు.

Exit mobile version