రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

*రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి*

ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 21 కామారెడ్డి జిల్లా గాంధారి.

గాంధారి మండలం చద్మల్ తండా గ్రామానికి చెందిన మాండు జీవన్ తండ్రి మాదాస్, వయసు 45 సంవత్సరాలు. తన అత్తగారు ఊరైన గురజాల తాండ గ్రామానికి వచ్చి రామలక్ష్మణ పల్లి గ్రామ శివారులో గల వాళ్ల అత్త గారి వ్యవసాయ పొలంకు తన మోటార్ సైకిల్ పై వెళ్లి తిరిగి వస్తుండగా బ్రాహ్మణపల్లి గ్రామ గేటు సమీపంలో అదుపుతప్పి రోడ్డుపైన పడగా తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మరణించాడు. స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

Join WhatsApp

Join Now