రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

*రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి*

*జమ్మికుంట ఏప్రిల్ 15 ప్రశ్న ఆయుధం*

IMG 20250415 WA2236

జిల్లాలోని జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల ఫ్లై ఓవర్ పైన జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు మృతి చెందిన వ్యక్తి మున్సిపల్ పరిధిలోని దుర్గా కాలనీకి చెందిన పురం శెట్టి తిరుపతి అని పోలీసులు గుర్తించారు పట్టణ సీఐ వర గంటి రవి తెలిపిన వివరాల ప్రకారం పురం శెట్టి తిరుపతి అని వ్యక్తి ఎలక్ట్రిక్ బైక్ పైన తన పని నిమిత్తం వెళ్తుండగా ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి డీసీఎం వ్యాన్ వెనుక టైర్ తల భాగంపై నుండి వెళ్లగా అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డీసీఎం వ్యానును డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు మృతుడి భార్య సృజన ఒక కూతురు కుమారుడు ఉన్నట్లు తెలిపారు మృతుని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment