గ్రామస్తులు ఎందుకని అడిగిన మీకు సమాధానం ఎందుకు చెప్పాలి మాట్లాడుతున్నాడు
ప్రశ్నఆయుధం న్యూస్ దమ్మపేట మండల ప్రతినిధి
దమ్మపేట మండల పరిధిలోని రాచూరుపల్లి పంచాయతీ ఆఫీసులో ఉన్న సెక్రెటరీ రవి తన విధులు నిర్వహిస్తుండగా. లచ్చాపురం గ్రామానికి చెందిన తాళ్ల సురేష్ అనే వ్యక్తి ఆల్కహాల్ సేవించి సెక్రెటరీ రవి ని బెదిరించి ఆఫీసులో నిర్బంధించడం జరిగింది. సెక్రటరీ ద్వారా చరవాణిలో సమాచారం అందుకున్న గ్రామస్తులు, సెక్రెటరీనీ విడిపించి, గ్రామస్తులు అతనితో మాట్లాడగా మీకెందుకు సమాధానం చెప్పాలని గ్రామస్తులతో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కూడా వివరణ అడగ్గా, మీకు సమాధానం ఎందుకు చెప్పాలి ఊర్లో పారిశుద్ధం పని లేదని, మాట దబాయిస్తూ, మద్యం మత్తులో విచక్షణారహితంగా మాట్లాడుతున్నాడు. గ్రామస్తులు అడిగిన సమాచారం మేరకు ఎప్పడు సెక్రెటరీ రవి తన పని తాను చేసుకుంటూ పంచాయతీ పనులలో పాల్గొంటున్నాడని. సెక్రటరీ తప్పు ఏమీ లేదు మేము చెప్తుండగా కూడా, మా మాట వినకుండా పంచాయతీకి తాళాలు వేసి నిర్బంధించాడని, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సెక్రెటరీ వివరాలు అడగ్గ రవి చెప్పిన సమాచారం మేరకు, అన్యాయక్రాంతంగా నన్ను ఈ విధంగా నిర్మించిన వ్యక్తిని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తున్నానని. నన్ను నిర్బంధించిన వ్యక్తిని కఠిన చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు.