కరెంటు మీటర్లు మంజూరు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందుజేత..
కామారెడ్డి జిల్లా బిక్కనూరు
ప్రశ్న ఆయుధం నవంబర్ 11:
రెండు సంవత్సరాలుగా నివాసముంటున్న పేద ప్రజలకు ఇంటి నెంబర్లు కేటాయించి కరెంటు మీటర్లు మంజూరు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం
కామారెడ్డి జిల్లాలోని బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామం మల్లు స్వరాజ్యం కాలనీలో గత రెండు సంవత్సరాలుగా పేద ప్రజలు నివాసం ఉంటున్నారని కరెంటు లేక అంధకారంలో జీవిస్తున్నారని పాములు తేల తో సహవాసం చేస్తూ తమ జీవనం కొనసాగిస్తున్నారని వీరికి ఇంటి నెంబర్లు కేటాయించి కరెంటు మీటర్లు మంజూరు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కే చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం 2008లో పట్టాలు ఇస్తే ఇళ్ల స్థలాలు కేటాయించి లేఅవుట్ చేయడం జరిగిందన్నారు స్తోమత ఉన్న వారు ఇండ్లు నిర్మించుకున్నారని మిగతా ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు అన్నారు. ప్రభుత్వం వారికి వెంటనే సౌకర్యాలు కల్పించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు నాయకులు పేరం నర్సవ్వ నర్సింలు శ్యామల రమణ కళావతి అర్జున్ బాబ్జాన్ బాలమ్మ తత్తర్లు పాల్గొన్నారు.
కరెంటు మీటర్లు మంజూరు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందుజేత..
by kana bai
Published On: November 11, 2024 10:28 pm