*కొత్త రైల్వే లైన్ పై ఫుట్ పాత్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని అధికారులకు వినతిపత్రం*
*జమ్మికుంట జనవరి 3 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నూతనంగా ఏర్పాటు చేయబడిన రైల్వే లైన్ పై ఫుట్ ఫాత్ బ్రిడ్జ్ సౌకర్యం లేనందున జమ్మికుంట పరిసర ప్రాంతాల నుండి వచ్చే సుమారు 50 గ్రామాల ప్రయాణికులు జమ్మికుంట లోని కొత్తపెళ్లి నుండి రైల్వే స్టేషన్ కు రావడానికి ప్రయాణికులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని రైల్వే ట్రాక్ దాటే సమయంలో ప్రయాణికులు మరణించిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఈ ప్రమాదకరమైన పరిస్థితులను రైల్వే శాఖ అధికారులు గుర్తించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని రామగుండం దక్షిణ మధ్య రైల్వే ఏడిఈఎన్ అధికారికి రైల్వే బోర్డు మెంబర్ అనుమాస శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో దూడం శ్రీనివాస్, ఎలుగూరి రమేష్ తదితరులు ఉన్నారు