Site icon PRASHNA AYUDHAM

కుక్కల బెడద నివారించాలని వినతి

కుక్కల బెడద నివారించాలని వినతి

ప్రశ్నాయుధం న్యూస్, సెప్టెంబర్ 29, కామారెడ్డి :

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి 12వ వార్డులో కుక్కల బెడదను నివారించాలని కోరుతూ వార్డ్ బిజెపి నాయకులు కానకుంట గోవర్ధన్ మున్సిపల్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. వీధి కుక్కలు కరవడం వలన చాలామందికి గాయాలైనట్లు తెలిపారు. మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు తెలిపిన పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా సమస్యను తీర్చాలని అన్నారు.
అదేవిధంగా 12వ వార్డులోని దేవునిపల్లిలో గత కొన్ని రోజులుగా చెత్త బండి రావడంలేదని చెత్త ఎక్కడికక్కడ పేరిపోతుందని ఫిర్యాదు చేశారు. చాలా ప్రదేశాల్లో విపరీతంగా గడ్డి పెరిగి క్రిమి కీటకాలకు ఆనవాలమైందని దీన్ని తొలగించాలన్నారు. ఈ విషయంలో అధికారులు చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.

Exit mobile version