వడ్డీతో సహా చెల్లిస్తాం.. జైలు నుంచి విడుదలఅనంతరం కవిత..
తిహార్ జైలు నుంచి విడుదలైన BRS MLC కవిత మీడియాతో మాట్లాడారు. ‘జై తెలంగాణ.. నేను తెలంగాణ బిడ్డను. కేసీఆర్ బిడ్డను. తప్పు చేసే ప్రసక్తే లేదు. ఎంత మంచిదాన్నో అంతే మొండిదాన్ని. చేయని నేరానికి జైలులో వేసి జగమొండిని చేశారు. వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం. సమయం వస్తుంది. ఈ కష్ట సమయంలో తోడుగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు అని కవిత తెలిపారు.