మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
ఢిల్లీ లిక్కర్ పాలసీతో ఎలాంటి సంబంధం లేకున్నా ఎమ్మెల్సీ కవిత పై ఈడీ అక్రమంగా కేసులు బనాయించి 168 రోజులు జైల్లో వేయించడం
బాధాకరం అని,ఆలస్యమైనా న్యాయమే గెలిచిందని అశ్వారావుపేట నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జీ మాజీ ఎమ్మెల్య మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.
లిక్కర్ పాలసీతో కవిత కి ఎలాంటి సంబంధం లేదని, వారి వద్ద నుంచి ఎలాంటి ఆధారాలు లభించలేదనీ.
ఎలాంటి ఆధారాలు చూపకుండా అక్రమంగా 168 రోజులు జైల్లో పెట్టారని. రాజకీయ ప్రేరేపిత కేసులో. ఆలస్యమైనా న్యాయమే గెలిచిందని,కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నారని,ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని మాజీ ఎమ్మెల్యే మెచ్చా గారు అన్నారు.