కుత్బుల్లాపూర్: జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది రోడ్డుపై వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి పక్కనే ఉన్న కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో.. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షాపూర్ నగర్ ఆదర్శ్ బ్యాంక్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేటు బస్సు బీభత్సం
Published On: August 25, 2025 9:04 pm