కర్నూలు సమీపంలో దగ్ధమైన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు..

కర్నూలు సమీపంలో దగ్ధమైన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు..

సుమారు 20 మంది మృతి..!

వి కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు (DD01N9490)

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నది.

ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో ఓ బైకును ఢీకొట్టింది.

దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బస్సు మొత్తానికి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది.

అంతా నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో పలువురు సజీవదహనం అయ్యారు.

ప్రమాదం సమయంలో బస్సులో 42 మంది వరకు ప్రయాణిస్తున్నారు.

ఎమర్జెన్సీ డోర్‌ నుంచి 20 నుంచి 25 మంది వరకు బయటపడినట్లు, 20 మంది వరకు దుర్మరణం చెందినట్లు సమాచారం.

బైక్‌పై వెళ్తున్నవారు కూడా మరణించారు.

సమాచారం పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది.

గాయపడిన వారిని కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు.

వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు.

ప్రమాదం తర్వాత ఘటనా స్థలం నుంచి ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌, సిబ్బంది పరారయ్యారు.

ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం.

అగ్నిప్రమాదం జరగడంతో జాతీయర రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ప్రమాదం నుంచి బయటపడినవారు..

సత్యనారాయణ- సత్తుపల్లి

జైసూర్య- మియాపూర్‌

నవీన్‌కుమార్‌- హయత్‌నగర్‌

సరస్వతి హారిక- బెంగళూరు

నేలకుర్తి రమేశ్‌- నెల్లూరు

కటారి అశోక్‌- రంగారెడ్డి జిల్లా

ముసునూరి శ్రీహర్ష- నెల్లూరు

పూనుపట్టి కీర్తి- హైదరాబాద్‌

వేణుగోపాల్‌రెడ్డి- హిందూపురం

రామిరెడ్డి- ఈస్ట్‌ గోదావరి

లక్ష్మయ్య, శివనారాయణ (డ్రైవర్లు)

బస్సు గురువారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరిందని కర్నూలు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు.

హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా బైకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయన్నారు.

గమనించిన డ్రైవర్‌, సహాయక డ్రైవర్‌ను నిద్రలేపాడు.

చిన్న ప్రమాదమనుకుని వాటర్‌ బబుల్‌తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు.

మంటలుఎక్కువయ్యేసరికి ప్రయాణికులను నిద్రలేపారు.

కొందరు ఎమర్జెన్సీ డోర్లను బద్దలు కొట్టి కొందరు బయటపడ్డారు.

ఎంతమంది చనిపోయారన్నదానిపై ఇప్పుడే చెప్పలేం.

హైవేపై వెళ్తున్నవారు కూడా సహాయం చేశారన్నారు. కొందరు ప్రయాణికులు కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.

డ్రైవర్‌, సహాయక డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం.

ప్రమాదంపై ఇద్దరిని ప్రశ్నిస్తున్నామని చెప్పారు..

Join WhatsApp

Join Now

Leave a Comment