విద్యుత్తు ఆర్టిజెన్లకు( ఏ.పీ.ఎస్ బి) సర్వీస్ రూల్స్ అమలు చేయాలి
– మాచారెడ్డి మండల ఆర్టిజెన్లు
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి
(ప్రశ్న ఆయుధం) జూలై 3
విద్యుత్తు ఆర్టిజన్లకు ( ఏపీఎస్పీ ) సర్వీస్ రూల్స్ అమలు చేయాలని మాచారెడ్డి మండల ఆర్టిజెన్లు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల ఆర్టిజన్ల సమావేశాన్ని, మండల కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టిజన్లు మాట్లాడుతూ విద్యుత్తు సంస్థలో గత 20, 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆపరేటర్లను ఆర్టిజన్గా గత ప్రభుత్వం గుర్తించింది కానీ పూర్తిస్థాయిలో రెగ్యులర్ చేయలేదన్నారు. ఒకే సంస్థలో ఒకే రూల్స్ కాకుండా రెండు వేరువేరు రూల్స్ పెట్టి మమ్మల్ని అన్యాయానికి గురిచేసిందన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే మమ్మలను పూర్తిస్థాయిలో రెగ్యులర్ చేస్తామాని హామీ ఇచ్చిందనీ, పాదయాత్ర సమయంలో ఇప్పుడు ఉన్న విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మమ్మల్ని రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరలు కావస్తున్న మమ్మల్ని విస్మరించింది, అందుకు నిరసనగా గత సంవత్సర కాలంగా నిరసన కార్యక్రమాలు తెలుపుతూ ప్రభుత్వానికి రెగ్యులర్ చేయమని విన్నవించుకున్న మమ్మల్ని పట్టించుకోలేదన్నారు. విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో 14వ తేదీన తలపెట్టబోయే నిరవధిక సమ్మెలో మాచారెడ్డి సెక్షన్ ఆర్టిజన్ కార్మికులు పాల్గొనుటకు నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మండల సీనియర్ ఆర్టిజన్స్, సునీల్, బాలేశం, సురేష్, రాజిరెడ్డి, నరేందర్, ప్రవీణ్,వెంకట్, తదితరులు పాల్గొన్నారు.