నాగర్ కర్నూల్ జిల్లా డీఈవో గా ఏ.రమేష్ కుమార్ నియామకం.
రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న రమేష్ కుమార్ ను నాగర్ కర్నూల్ జిల్లా డీఈవోగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రమేష్ కుమార్ ను నాగర్ కర్నూల్ జిల్లా డీఈవోగా పదవీబాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో నరసింహారెడ్డి ఆదేశించారు.
నాగర్ కర్నూల్ జిల్లా డీఈవోగా ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్ యం. గోవిందరాజులును నారాయణపేట, డీఈవోగా బదిలీ చేస్తూ గద్వాల జిల్లాకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు.
నాగర్ కర్నూల్ డీఈఓ గోవిందరాజులు ఫిబ్రవరి 6వ తేదీ 2019 నాటినుండి సుదీర్ఘంగా జిల్లాలో సేవలందించారు.
సుదీర్ఘంగా పనిచేసే జిల్లా విద్యాభివృద్ధికి కృషిచేసిన డిఈఓ గోవిందరాజులు పలువురు ప్రధానోపాధ్యాయులు కలిసి అభినందనలు తెలిపారు.