Site icon PRASHNA AYUDHAM

డిసెంబ‌ర్ 21న అరుదైన ఘ‌ట‌న‌…రాత్రి 16గంటలు..పగలు 8గంటలు..

IMG 20241220 WA0141

*డిసెంబ‌ర్ 21న అరుదైన ఘ‌ట‌న‌..*

*రాత్రి 16గంటలు..పగలు 8గంటలు..*

సాధారణంగా ఒక రోజు అంటే.. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. అయితే శీతాకాలంతో పాటు కొన్ని సార్లు పగలు ఎక్కువగా ఉండటం, రాత్రుళ్లు తక్కువగా ఉండటం.. పగలు తక్కువగా ఉండి, రాత్రుళ్లు ఎక్కువగా ఉండటం జరుగుతుంది. సాధారణంగా ఇలా జరిగే ప్రక్రియను అయానంతం సోల్​స్టీస్ అంటారు. తాజాగా అలాంటి రోజు ఈ ఏడాది డిసెంబర్​ 21వ తేదీన రాబోతుంది. ఈ రోజున పగటి సమయం(8గంటలు) తక్కువగా, రాత్రి సమయం(16గంటలు) చాలా ఎక్కువగా ఉంటోంది.

శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడిన రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024, డిసెంబరు 21న ఈ ఏడాదిలో అత్యంత తక్కువ పగలు, సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది. భూమి దాని అక్షం మీద తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి నుండి సూర్యుడి దూరం గరిష్టంగా ఉన్న రోజున అయనాంతం వస్తుంది. ఇది ఏటా రెండుసార్లు జరిగే ఘట్టం.

శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజు, తేదీ ఏటా మారుతూ ఉంటాయి. ఇక ఈ ఏడాది 21వ తేదీన ఈ అరుదైన ఘట్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అది డిసెంబర్ 20- 23 తేదీల మధ్యనే వస్తుంటుంది. డిసెంబర్ 21న భూమికి సూర్యునికి గరిష్ట దూరం ఉండటం వల్ల సూర్యకిరణాలు ఆలస్యంగా భూమిని చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కూడా కనిపిస్తుంది. దీంతో శీతాకాలంలో ఏర్పడే అయనాంతంపై పలు దేశాలలోని ప్రజలు పలురకాల నమ్మకాలను పాటిస్తుంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో, బౌద్ధమతంలోని యిన్, యాంగ్ శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు అయనాంతం ఐక్యత, శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు. ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి, గీతాపారాయణం చేస్తారు. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో పుష్య మాస పండగను ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడి ఉత్తరాయణ ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుంచి మొదలవుతుంది. అందుకే మన దేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

Exit mobile version