*మాజీ సైనికుల సంక్షేమ సంఘానికి 500 గజాల స్థలం కేటాయించాలని వినతి*

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని వెలుగు కార్యాలయం వద్ద మాజీ సైనికుల సంక్షేమ సంఘానికి 500 గజాల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ సైనిక్ వెల్ఫేర్ బోర్డ్ సభ్యుడు తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ వల్లూరు క్రాంతికి సోమవారం వినతి పత్రం సమర్పించారు. గతంలో 250 గజాల స్థలాన్ని కేటాయించారని, 500 గజాలకు పెంచాలని కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు వటపత్ర సాయి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now