సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కేంద్రం 33వ వార్డులోని ఓడీఎఫ్ మధురానగర్ కాలనీలో రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతూ కౌన్సిలర్ నాగరాజు, అధ్యక్షుడు విఠల్ నాయక్, కార్యదర్శి రమణరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులతో మాట్లాడి రోడ్డు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
కాలనీలో రోడ్డు సమస్యను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కు వినతి
Published On: January 18, 2025 4:48 pm
