*ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ ఎమ్మార్వో కు వినతి*
ప్రశ్న ఆయుధం ,మిర్యాలగూడ డిసెంబర్ 19:
వేములపల్లి మండలంలోని ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు పిఎంటిఏ-టీఎస్ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు,గత దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల సాధనకై తలపెట్టిన నిరసన కార్యక్రమం 5వ రోజుకు చేరుకుంది.నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు మండల స్థాయి అధికారులు మండల రెవెన్యూ ఆఫీసర్,మండల విద్యాధికారులకు వినతి పత్రం అందజేశారు.010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని,ఫైలు ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్న కారణంగా ప్రభుత్వ స్పందించి వెంటనే జీవో విడుదల చేయాలని,విద్యాశాఖలో విలీనం చేసి, నేషనల్ సర్వీస్, నోషనల్ ఇంక్రిమెంట్ ,హెల్త్ కార్డుల జారీ, కారుణ్య నియామకాలు చేపట్టాలనీ, ప్రమోషన్స్ కల్పించాలనీ, లేనిచో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని ఉపాధ్యాయులు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ జి.దీన సుజాత, పి. ప్రసాద్, పి.అంజయ్య, ఎస్. బ్రహ్మం, పి. పురుషోత్తం, ఎస్.రవీందర్ ,వి.కిరణ్ శాంసన్, డి. రవీందర్ నాయక్, బి. మల్లేషా ,ఎం ఉపేందర్, నయీ మున్నిస, షబానా అంజుమ్, టీ. మీనా కుమారి, పాటలీ చంద్ర, ఆర్. లక్ష్మి ,ఆర్. కోటేష్, ఆర్. కమహాసన్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.