Site icon PRASHNA AYUDHAM

బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో సమీక్ష సమావేశం 

IMG 20250725 WA0432

బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో సమీక్ష సమావేశం

 

*•ఆస్తి సంబంధిత నేరాలను అరికట్టేందుకు బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో సమీక్షా సమావేశం*

*• బాన్సువాడ పోలీస్ స్టేషన్ సందర్శన, సిబ్బందికి మార్గ నిర్దేశం*

*• పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా ప్రతీ సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలి*

*• భారీ వర్షాల నేపథ్యంలో బాన్సువాడ ట్యాంక్‌బండ్ మరియు PS పరిధిలో మంజీర డ్యాం, గాంధారి PS పరిధిలో పెద్ద గుజ్జల్ తండా, సర్వాపూర్ వాగుల పరిశీలన.*

_*జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర IPS*_

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 25

 

 

 

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్, శుక్రవారం రోజున బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా రోల్ కాల్‌ను పరిశీలించి, హాజరు/గైర్హాజరు సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు.సిబ్బంది ప్రతి ఒక్కరు అన్నిరకాల విధులను తెలుసుకొని ఉండాలని, మారుతున్న సమాజానికి అనుగుణంగా, ఎలాంటి విధులనైనా చేయగలిగే విధంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని/ ఆధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు.

హిస్టరీ షీటర్స్, పాత నేరస్తులపై నిరంతర నిఘా, నైట్ బీట్, పెట్రోలింగ్ కార్యకలాపాలలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్ యాప్స్, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల ద్వారా అవగాహన పెంచాలని, నేరాల నివారణకు మరియు చేధనకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు.

ముఖ్యముగా ఆస్తి సంబంధిత నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో సమీక్షా సమావేశం జిల్లా పోలీస్ అధికారి యం. రాజేష్ చంద్ర IPS, నిర్వహించారు ఈ సమీక్షలో బాన్సువాడ సబ్ డివిజన్ డీఎస్పీ బి విట్టల్ రెడ్డి, మరియు బాన్సువాడ టౌను, రూరల్, బిచ్కుంద ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఆస్తి నేరాలను నియంత్రణ చేయడంలో సవాళ్లను పరిశీలిస్తూ నేరాల నివారణ కోసం జిల్లా ఎస్పీ పలు సూచనలు, సలహాలు చేశారు.అదేవిధంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో బాన్సువాడ ట్యాంక్‌బండ్, మరియు PS పరిధిలో మంజీర డ్యాం గాంధారి PS పరిధిలో పెద్ద గుజ్జల్ తండా సర్వాపూర్ వాగులను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర IPS, పరిశీలించారు. వాగులు, వంతెనలు దాటి ప్రయాణించరాదని, సెల్ఫీలు తీసుకోవడం చేపల వేటకు వెళ్లడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ఈ విషయం ప్రజలకు తెలియజేయాలని, అధికారులకు సూచనలు

ఇట్టి కార్యక్రమంలో బాన్సువాడ డిఎస్పీ బి. విట్టల్ రెడ్డి, బాన్సువాడ సబ్ డివిజన్ సిఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు .

Exit mobile version