పట్టించుకోని మున్సిపల్ అధికారులు పడకేసిన పాలకవర్గం

*పట్టించుకోని మున్సిపల్ అధికారులు పడకేసిన పాలకవర్గం*

 

*మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బంది*

 

*జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు జీడి మల్లేష్

 

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 27*

 

      పేరు పెద్ద ఊరు దిబ్బ అన్నట్టుగా జమ్మికుంట మున్సిపాలిటీ పరిస్థితి గోచరిస్తుందని జమ్మికుంట మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలు ఉన్న పట్టించుకోని మున్సిపల్ అధికారులు పాలకవర్గమని జమ్మికుంట బిజెపి పట్టణ అధ్యక్షుడు మల్లేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ తీవ్రంగా ఆరోపించారు జమ్మికుంట మున్సిపాలిటీలో సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు పాలకవర్గం పూర్తిగా వైఫల్యం చెందిందని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 26 వ వార్డులో బిజెపి శ్రేణులు పర్యటించి అక్కడున్న సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు వర్షం పడితే చాలు కాలనీలోని అనేక ఇండ్లలోనికి వర్షపు నీరు చేరి ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వార్డులోని కల్లూరి సదానందం అనే వ్యక్తి ఇల్లు వర్షం నీటితో కూలిపోయే ప్రమాదం ఏర్పడిందని కానీ మున్సిపల్ అధికారులు పాలకవర్గం ఇంత పెద్ద సమస్యను చూసి చూడనట్టు వివరించడం దుర్మార్గమని బిజెపి నాయకులు మండిపడ్డారు. వార్డు ప్రజలకు మద్దతుగా బిజెపి నాయకులు శుక్రవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. లేనట్లయితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజలను కలుపుకొని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పల్లపు రవి, అప్పం మధు యాదవ్ మోతే స్వామి తూడి రవిచంద్ర రెడ్డి మోడెం రాజు బూరుగుపల్లి రామ్ ఉడుగుల మహేందర్ ముకుందం సుధాకర్ అప్పల రవీందర్ కొండపర్తి ప్రవీణ్ కన్నెబోయిన బద్రి మురికి మహేష్ కేశ స్వరూప దిండిగాల రాజశేఖర్ వడ్లపల్లి శ్రీనివాస్ గండ్ర సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now