మాదిగ మహిళలను కించపరిచిన పంచాయతీ కార్యదర్శి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పోసాన్ పల్లి రాజు
ప్రధాన కార్యదర్శి మచ్చ గణేష్
జగదేవపూర్ జనవరి 17 ప్రశ్న ఆయుధం :
కుల అహంకారం తో మాదిగ మహిళలను కించ పర్చిన మంజుల రెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి జగదేవపూర్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మార్పీఎస్ జగదేవపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పోసాన్ పల్లి రాజు ప్రధాన కార్యదర్శి మచ్చ గణేష్ మాట్లాడుతూ రెడ్డి అనే అహంకారం తో మాదిగ మహిళలను అవమాన పరచిన మంజుల రెడ్డి నీ వెంటనే అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు. రెడ్డి లకు ప్రతి సందర్భంలో మాదిగలను అవమాన పర్చడం అలవాటు అయిపొయింది అన్నారు. ఎస్ సి ఎస్ టి చట్టాన్ని పోలీసులు పటిష్టంగా అమలుచేయాలని అన్నారు. మంజుల రెడ్డి పైన ఎస్ సి ఎస్ టి అట్రాసిటీ కేసు నమోదు చేసేంతవరకు ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తుంది అన్నారు ఈ కార్యక్రమం లో కోశాధికారి కురాడపు బాబు ప్రచారం కార్యదర్శి పైన స్వామి, గోపాల్ పూర్ గ్రామ అధ్యక్షులు మాసపాక కనకయ్య తదితరులు పాల్గొన్నారు.