పాల వ్యాన్ ఢీకొని స్కూల్ విద్యార్థిని మృతి

పాల వ్యాన్ ఢీకొని స్కూల్ విద్యార్థిని మృతి

చిగురుమామిడి,డిసెంబర్19

:ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న ఓ చిన్నారిని అతివేగంగా వస్తున్న ఓ పాల వ్యాను ఢీకొట్టడంతో తీవ్ర రక్తస్రావంమై మృతి చెందిన విషాద సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.చిగురుమామిడి ఎస్సై బండి రాజేష్,గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి… బొమ్మనపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న బొల్లి మహేష్ కు ఇద్దరు కూతుళ్లు కాగా చిన్న కూతురు బొల్లి మహి(7)సంవత్సరాల అనే చిన్నారి పాఠశాల ముగిసిన అనంతరం తన ఇంటికి వెళ్తున్న క్రమంలో పాపను టిఎస్ 23T 6285 నంబర్ గల మిల్క్ వ్యాన్ డ్రైవర్ అయిన రాకేష్ అనే వ్యక్తి వెనుక నుంచి టక్కరి ఇవ్వడం వలన తలకుతీవ్ర రక్తస్రావం జరగడంతో వెంటనే 108లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు వివరించారు. మృతురాలి తండ్రి బొల్లి మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిల్క్ వ్యాన్ డ్రైవర్ పైన కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ వివరించారు. బొమ్మనపల్లి గ్రామంలోని స్కూల్ ముందు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో యువకుడు మృతి చెందిన సంఘటన మరువకముందే పాఠశాల విద్యార్థి మృతి చెందడంపై గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.చిన్నారి మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది.

Join WhatsApp

Join Now