భారీ వర్షానికి కూలిన రేకుల షెడ్డు

భారీ వర్షానికి కూలిన రేకుల షెడ్డు
ప్రశ్న ఆయుధం21జులై భద్రాద్రి కొత్తగూడెం
నిరాశ్రయులకు బౌద్ధం అభిమానులు 3000 రూపాయలు, స్థానికులు 1500 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిమానవత్వాన్నిచాటుకున్నారు.గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మణుగూరుమున్సిపాలిటీ పరిధిలోని విఠల్ రావు నగర్ లో శనివారం రాత్రి ఒక రేకుల షెడ్డు కూలి గోగుల జయలక్ష్మి ఆమె కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు,భర్త లక్ష్మయ్య మృతితో జయలక్ష్మి కూలినాలీ చేసుకునిఇద్దరుకుమార్తెలు,లలిత,తులసి లను పోషించు కుంటూ రేకుల షెడ్డులో నివసిస్తోంది,భారీ వర్షం ఆమె పాలిట శాపం అయింది, ఆకస్మికంగారేకులషెడ్డుకూలిపోయింది, కాగా అర్ధరాత్రి రేకుల షెడ్డు కూలిపోయినప్పుడు గమనించిన ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ బాధిత కుటుంబాన్ని మణుగూరు ఓసి సింగరేణి కార్మికుడు మందా కోటేశ్వరరావు (ఎలక్ట్రీషియన్) భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని కాపాడడంతో ఆయన్ని విఠల్ రావు నగర్ వాసులు అభినందించారు, సంఘటన సమాచారంతెలుసుకున్న బౌద్ధం అభిమానసంఘంనాయకులు పూర్వ విఠల్ రావు నగర్ వాసి ఐ ఎఫ్ టి యు నాయకులు ఏ మంగీలాల్ 3000 రూపాయలు, విఠల్ రావు నగర్ వాసులు సామాజిక కార్యకర్తలు 1500 రూపాయలు నిరాశ్రయులైన జయలక్ష్మి కి ఆదివారం ఉదయం నగదును అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు, ఈ సందర్భంగా మంగీ లాల్ మాట్లాడుతూ భారీ వర్షాలకు రేకుల షెడ్డు కూలి నిరాశ్రయులైన జయలక్ష్మి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారిని కోరారు ఈ విషయమై బాదిత కుటుంబంతో ఎమ్మెల్యే గారిని కలుస్తామని తెలిపారు, అలాగే సామాజిక కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్ నిలుస్తున్న మణుగూరు మరియు ఇతర ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సంస్థలు జయలక్ష్మి కుటుంబానికి అండగా నిలవాలని ప్రభుత్వం ఇల్లు కూలిపోయిన వ్యక్తిని ఆదుకొని ఇంటి నిర్మాణానికి పూనుకోవాలని కోరారు. జయలక్ష్మి కి ఆమె కుమార్తెలకు ధైర్యం చెప్పారు, ఈ కార్యక్రమంలో మణుగూరు బౌద్ధం అభిమానులు స్థానికులు మందాకృష్ణ,జెశ్రీకాంత్,సత్తిబాబు,పోచమ్మ,అన్నపూర్ణ.ఇందిరా,మంజుల,భవాని,లక్ష్మితదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now